ఓటరును కాలితో తన్నిన ఎమ్మెల్యే తమ్ముడు

ఓటరును కాలితో తన్నిన ఎమ్మెల్యే తమ్ముడు

విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్న తరుణంలో  అక్కడక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా ఆంధ్రాలో ఓటర్ పై ఎమ్మెల్యే చేయి చేసుకొగా తిరిగి ఓటర్ సైతం ఎమ్మెల్యే పై దాడి చేసిన సంఘటన సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా తెలంగాణ లో కూడా కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. జహీరాబాద్​ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్ సోదరుడు నగేష్​ షెట్కార్... ఓటర్​ ను కాలితో తన్నడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన నారయణఖేడ్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగింది. కాగా ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంపీ అభ్యర్ధి తమ్ముడిపై నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. అలాగే అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More జోగులాంబకు బోనం పట్టు వస్త్రాలు సమర్పణ