ఎంపీ రవిచంద్ర కు "అక్షర కానుక"
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన ప్రముఖ గాయకులు ఓరుగంటి మధు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అక్షర పద కూర్పుతో కూడిన అక్షర కానుక బహూకరించారు. వద్ది రాజు రవిచంద్ర పేరులోని అర్థాన్ని, ఆయన వ్యక్తిత్వం, గొప్పతనాన్ని వివరిస్తూ కూర్పు చేసిన ఫోటో ప్రేమ్ ను సుప్రసిద్ధ విప్లవ గాయకురాలు అరుణోదయ విమలక్క, సౌండ్ ఇంజనీర్ రవి తో కలిసి అందజేశారు. ఎంపీ రవిచంద్ర ఆశీస్సులతో త్వరలో వి.ఆర్.సి పేరుతో మధు హన్మకొండ సుబేదారిలో నెలకొల్పనున్న రికార్డింగ్ స్టూడియో డిజె సౌండ్స్ బ్రోచర్ ను ఈ సందర్భంగా వద్దిరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, త్వరలోనే ఎంచుకున్న రంగంలో మధు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.



