నాగన్న కు విప్లవ జోహార్లు అర్పించిన పలువురు .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : అరుణారుణ జోహార్లు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ పరకాల నాగన్న (అరుణోదయ నాగన్న )ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఖమ్మం పట్టణం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లో చికిత్స పొందుతూ మరణించారు . వారి మృతికి సంతాపంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు నాగన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూపేద , ప్రజల జీవిత గాధలను, అణగారిన వర్గాల బాధలను తన గళంలో నింపుకుని జీవితాంతం ప్రజల పక్షాన నిలిచిన విప్లవ సాంస్కృతిక యోధుడు పరకాల నాగన్న మరణం (అరుణోదయ నాగన్న) కుటుంబానికి తీవ్ర విషాదకరం అని గుర్తు చేశారు . అంతేకాకుండా నాగన్న పేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే ప్రజల కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలను తన పాటల ద్వారా వ్యక్తికరించే వారని అన్నారు . ఆయన గాత్రం కేవలం వినోదానికి పరిమితం కాలేదు; అది అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు ప్రతిధ్వనిగా నిలిచింది. ప్రజల పోరాటాలు, రైతులు, కూలీలు, ఆదివాసీలు, అణగారిన వర్గాల జీవిత వాస్తవాలను తన పాటల ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చిన ప్రజా కళాకారుడిగా ఆయన చిరస్మరణీయులు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సాధారణ సభ్యుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన నాగన్న ఎంతోమంది కళాకారులను సాంస్కృతిక సైన్యంగా మార్చి విప్లవోద్యమానికి అందించాడు. నాగన్న తన చివరి శ్వాస వరకు అంకితభావంతో పనిచేశారు. ఎన్నో నిర్బంధాలు, వేధింపులు, కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన తన విప్లవ సాంస్కృతిక ప్రయాణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రజా సాంస్కృతిక ఉద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధత, త్యాగం, పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈ రోజు ఆయన కన్నుమూయడం ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి, ప్రజాస్వామిక-విప్లవ ఉద్యమాలకు తీరని లోటు. ఆయన ఆలపించిన విప్లవ గీతాలు, ప్రజల పట్ల ఆయనకున్న అచంచల నిబద్ధత, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన మరణం ప్రజల పక్షాన నిలిచిన ఒక గొప్ప విప్లవ సాంస్కృతిక యోధుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు అరుణోదయ నాగన్న సంతాప సభలో ఆయన జీవిత విశేషాలను, ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు . ఈ సంతాప సభలో సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు హలావత్ లింగ్యా, భోగ రవిచంద్ర , పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామ పాపయ్య, బట్టు చైతన్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్ , అరుణోదయ సంస్కృతిక సమైక్య జిల్లా నాయకులు కుక్కమూడి యాకయ్య ,మునిత , తెల్లబోయిన కృష్ణ , సురేష్ , లింగయ్య , నాగేశ్వరరావు , ఆయిలేష్ , తదితరులు పాల్గొన్నారు .