వచ్చే నెల నుంచే రైతు రుణమాఫీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

వచ్చే నెల నుంచే రైతు రుణమాఫీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి



తెలంగాణలో రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి అనే దానిపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

Read More డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడుపుతే ఊరుకునే ప్రసక్తే లేదు

ఆయన మాట్లాడుతూ వచ్చే నెల జులై నుంచే రుణమాఫీని ప్రారంభిస్తామని వివరించారు. రైతుల రుణమాఫీని వంద శాతం పూర్తి చేస్తామని.. కొందరికి చేసి.. కొందరికి వదిలేయబోమని స్పష్టం చేశారు. తాము రైతు రుణమాఫీని చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలక ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. 

రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరం అవుతాయని.. అందుకు తగ్గ నిధులను సేకరిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్లు తాజాగా వైరల్ అవతున్నాయి.