బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

  • మంత్రిని కలిసిన వారిలో సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ
  • ఇంకా కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా...

రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారుWhatsApp Image 2024-07-06 at 5.18.41 PM (1)

Read More సురవరం సుధాకర్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ