మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి కి   చేనేత దినోత్సవ ఆహ్వానం 

మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి కి   చేనేత దినోత్సవ ఆహ్వానం 

ప్రజా విశ్వంభర, ఎల్ బీ నగర్ : 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యములో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఆగస్ట్ 7 వ తేదీన ఆటో నగర్ లోని కర్నాటి గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి  ని ఆయన కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.  చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కళాకారులు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలకు  సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ వారు అన్నారు.  చేనేత దినోత్సవం సందర్బంగా నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే చేనేత కార్మికులకు , అవార్డు గ్రహీతలకు సన్మానం చేయడం సంతోషకరమైన విషయమని కొప్పుల నర్సింహా రెడ్డి అన్నారు. తప్పకుండ హాజరు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత, పొట్టబత్ని జ్ఞానేశ్వర్, చేరిపల్లి ప్రభాకర్ నేత, జెల్ల నరేందర్ నేత, బొమ్మ దశరద నేత, శివ నేత తదితరులు పాల్గొన్నారు.

 

Read More సమాజ హితం కోరే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి .

Tags: