ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం:
నకిరేకల్ ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ.
On
విశ్వంభర, నకిరెకల్ ; ఆగస్టు 3న తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యం లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమం ను విజయవంతం చేద్దాం అని నకిరేకల్ ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ అన్నారు. . బుధవారం నల్లగొండ జిల్లా నకిరెకల్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాచం సత్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరై వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని అన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా వైశ్యులను గుడి , బడి వద్ద సేవ కార్యక్రమాలకు వాడుకుంటున్నారే తప్ప, రాజకీయంలో సీట్లు కేటాయించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక సలహాదారులు బుక్క ఈశ్వరయ్య నకిరేకల్ మండల అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ , నకిరేకల్ టౌన్ అధ్యక్షుడు వీరవెల్లి రఘు , టౌన్ సెక్రెటరీ ఉప్పల సంతోష్ , నకరికల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమా కృష్ణమూర్తి , ఆర్యవైశ్య జిల్లా నాయకులు సోమ యాదగిరి , మంచుకొండ సోమయ్య , గుండా వెంకటయ్య , ఉప్పల రమేష్ , శ్రీకాకుళ వెంకన్న , ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు వీర్లపాటి నరసింహ రావు , లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ , శ్రీ వాసవి సేవా సంఘం నల్గొండ డిస్టిక్ అధ్యక్షుడు శ్రీకాకుళ మిధున్ , ఆర్యవైశ్య సంఘం మెంబర్లు కార్యకర్తలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.



