మహేశ్వరం మండలం మాన్షన్ పల్లి లో భూ వివాదం

మహేశ్వరం మండలం మాన్షన్ పల్లి లో భూ వివాదం

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల పరిధిలోని మన్షన్ పల్లి గ్రామంలో భూ వివాదం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. సర్వే నెంబర్ 85, 86, 35, 36లో ఉన్న భూములపై భారీ స్థాయిలో లావాదేవీలు జరగడంతో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వట్టేలా మల్లేష్ మాట్లాడుతూ, తాను 2005 సంవత్సరంలో దడ్వయి అంజప్ప, దడ్వయి మల్లప్పల నుంచి 13 ఎకరాల భూమిని కోటి రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు, అయితే ఆ భూమి అప్పటికే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉండడంతో, అప్పటి నుంచి ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చారని ఆరోపించారు. అగ్రిమెంట్ అనంతరం పలుమార్లు డబ్బులు చెల్లించినట్లు మల్లేష్ తెలిపారు, ఒకసారి 86 లక్షలు, 2021లో మరోసారి 7 కోట్ల 20 లక్షలు చెల్లించినప్పటికీ ఇప్పటికీ భూమి పొజిషన్ ఇవ్వలేదని వాపోయారు, మొత్తం లావాదేవీలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ, పట్టాదారు మాట తప్పాడని ఆరోపించారు. ఇదే సర్వే నంబర్లలో మధుసూదన్ రెడ్డి, రాజా సక్సేనా అనే వ్యక్తులు దాదాపు 100 ఎకరాల భూమిని ఏజిపి ద్వారా తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ భూమికి సంబంధించిన వివాదం మరింత తీవ్రతరమైంది. సుధాకర్ తన అనుచరులు అంత కలిసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పొలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్ నిర్మాణాలను తొలగించి నేల మట్టం చేశారు, ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ రెవెన్యూ చట్టాలు, ముఖ్యంగా భూమి రిజిస్ట్రేషన్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ (సెక్షన్ 22-A) ఉల్లంఘన జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న భూములపై లావాదేవీలు జరగడం చట్ట విరుద్ధమని, దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని సూచిస్తున్నారు. 

అధికారులకు వినతి ..న్యాయం చేయాలని విజ్ఞప్తి

Read More చిన్నారుల పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి 

తాను కొనుగోలు చేసిన 13 ఎకరాల భూమికి తక్షణం పొజిషన్ కల్పించాలని, మోసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వట్టేలా మల్లేష్ రెవెన్యూ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. బాధితుడికి న్యాయం చేయాలని, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలోని రైతుల్లో భూముల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, భూములపై స్పష్టమైన హక్కులు, రికార్డుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.  మహేశ్వరం మండలంలోని ఈ భూ వివాదం, కోట్ల రూపాయల లావాదేవీలు, చట్టాల ఉల్లంఘనలు కలగలిపి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నిజానిజాలు వెలికితీయాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.WhatsApp Image 2026-04-24 at 9.16.34 PM

Tags: