వాసవి కన్యకాపరమేశ్వరి మహోత్సవాల్లో పాల్గొన్న డా. కాచం
విశ్వంభర, మీర్ పేట్ :-శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో గణపతి స్పటిక లింగ సహిత సరస్వతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఏప్రిల్,23, 2026 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు దేవాలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి షడాధార ప్రతిష్ట కార్యక్రమం మరియు ఐదు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలకు స్థానిక ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా నేడు వైశ్య వికాస వేదిక చైర్మన్ ప్రముఖ సామాజికవేత్త వి3 న్యూస్ ఛానల్, విశ్వంభర దినపత్రిక సీఎం డి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త అమ్మవారి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్నారు. దేవాలయ కమిటీ బృందం, ఆలయ కమిటీ చైర్మన్ తెరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎరువేంటి సురేష్ గుప్తా, కోశాధికారి గంద వెంకన్న, బాలాపూర్ మండల అధ్యక్షులు నాలా శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి బాల జంగయ్య గుప్తా, పోల రమేష్, పోరి నరేంద్ర గుప్తా, శ్రీనివాస్ గుప్తా, బడంగ్ పేట కంటెస్టెడ్ కార్పొరేటర్ అనిత, పబ్బరాజు, గంధం శివ ప్రకాష్, కూర రమేష్ తదితరులు పాల్గొన్నారు



