స్కిల్ స్టోర్క్ స్కూల్లో అలరించిన సీబీఎస్ఈ విద్యార్థుల నృత్యాలు..ప్రిన్సిపాల్ ఉజ్వల పవార్ వెల్లడి
On
విశ్వంభర, హనుమకొండ :- భీమారం రామారం లోని స్కిల్ స్టోర్క్ స్కూల్ 5 వ వార్షికోత్సవంను పాఠశాల డైరెక్టర్ ఎర్రబెల్లి అనూప్ ఆదేశానుసారం రెండో రోజు శుక్రవారం సీబీఎస్ఈ విద్యార్థుల ప్రదర్శనలతో అట్టహాసంగా నిర్వహించినట్లు స్కిల్ స్టోర్క్ సీబీఎస్ఈ ప్రిన్సిపాల్ ఉజ్వల పవార్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉజ్వల పవార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవసరమని తెలిపారు.ఈ సందర్భంగా సిబిఎస్ఈ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్ రావు,డైరెక్టర్ ఎర్రబెల్లి సువర్ణ వైస్ ప్రిన్సిపాల్,సీబీఎస్ఈ కో ఆర్డినేటర్ చంద్రప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.



