బీఆర్ఎస్ నేత హత్యకు నిరసనగా కేటీఆర్ రాస్తారోకో
కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండలకేంద్రంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు రాస్తారోకో చేపట్టారు.

మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హత్యా రాజకీయాలు మానుకోవాలని, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, బుధవారం రాత్రి శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని దుండగులు ఆయనను కిరాతకంగా నరికి చంపేశారు.