మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్
అనారోగ్యం కారణంగా మృతి చెందిన చేనేత కార్మిక కుటుంబానికి తెలంగాణ ప్రాంత మహిళా విభాగం ఆర్ధిక సాయం
On
విశ్వంభర,నల్లగొండ/చండూర్:- ఇటీవల కిడ్నీ వ్యాధితో మరణించిన చండూర్ పట్టణానికి చెందిన వర్కాల వేణు గోపాల్ కుటుంబాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ పరమర్శించి పదివేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ కుమార్ సమక్షములో వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా గుంటక రూప సదాశివ్ మాట్లాడుతూ చేనేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఈ చేనేత వృత్తిని మరికొంతమంది కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువును దూరంగా పెట్టి కుటుంబ బాధ్యతలు కోసం చిన్ననాటి నుండే చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, కంటి చూపు మందగించడం, గుండె వ్యాధులు రావడం, కిడ్నీ సమస్యలతో ఎంతో మంది చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా చండూరు పట్టణానికి చెందిన వర్కాల వేణుగోపాల్ గత ఐదు సంవత్సరాలుగా కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో మనోవేదన గురయ్యాడని, గత నెల రోజుల కింద వారు మరణించడం చాలా బాధాకరం విషయం అని ఆమె అన్నారు. వారి కుటుంబానికి ఏదో ఒక విధంగా ధైర్యం చెప్పి మా వంతు సాయంగా కొంత ఆర్ధిక సాయం చేయాలనీ నేడు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నామని ఆమె అన్నారు. గతంలో చండూర్ లో ఉండే వారి కుటుంభం డయాలసిస్ కోసం జిల్లా కేంద్రంలోనే అద్దె కు ఉన్నారని, ప్రస్తుతం అతని భార్య జిల్లా కేంద్రంలో ఉంటున్నారని తెలుసుకొని నల్గొండ జిల్లా అధ్యక్షులుతో కలిసి ఆర్ధిక సాయం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు నోముల రేఖ, చిన్నకోట్ల సప్నారాజ్, మడూర్ శశికళ, ఆడెపు శాంతి, జిల్లా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



