సంస్థాన్ లో ఘనంగా కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు..

సంస్థాన్ లో ఘనంగా కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు..

WhatsApp Image 2024-07-20 at 17.02.43_df919d91

విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, మన గ్రామ బిడ్డ చట్టసభలకు వెళ్లడం, మన గ్రామానికి గర్వకారణమని..భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాచకొండ రవి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాములు సాగర్,పాశం కృష్ణ యాదవ్,బోడ్డుపెల్లి గాలయ్య,చిలువేరు ముత్యాలు,మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ,ఉప్పల శ్రీను,రాసాల వేంటకటేష్ సాగర్,చిలువేరు బుగ్గ రాములు, గుండమల్ల సతీష్, మహిళ నాయకురాలు చింతకింది ఉషా,రాచకొండ గిరి, ఉప్పల అంజయ్య, ఎడ్ల సత్తయ్య ,వినుకొండ శ్రీనుచారీ,మందుగుల సాయి,రామకృష్ట, తదితరులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.