భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
8 జూలై 2024 విశ్వంభర మేడిపల్లి మండలం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తుంబ రావుపేట గ్రామంలో భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం అనంతరం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయిన నిందితుడు
ఉపాధి నిమిత్తం బెహరాన్ వెళ్లి పనిచేసే భర్త లింగం ఆదివారం సాయంత్రం బెహరాన్ నుండి తిరిగివచ్చి రాత్రి భార్య పడుకున్న సమయము చూసి తలపై పారతో బాది హత్య చేసి అనంతరం ఎస్సార్ ఎస్పి కెనాల్ వద్ద పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్యను హత్య చేసిన విషయం చెప్పి లొంగిపోయిన భర్త రాయ0చు లింగం48 సంవత్సరాలు మృతురాలిపై అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపినట్లు సమాచారం పురుగుల మందు తాగిన భర్త రాయ0చు లింగమును చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు పరిస్థితి విషమం మృతురాలు లక్ష్మీ 40 సంవత్సరాలు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలింపు మృతురాలికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నాడు కొడుకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం లో ఉన్నాడు వివరాలు తెలియాల్సి ఉంది మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ జరుపుతున్నారు