విద్యార్థుల భవిష్యత్తు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : హరీష్ రావు
On
విశ్వంభర, మెదక్ : విద్యార్ధుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు.
422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.