చిట్యాలలో ఉచిత మెగా వైద్య శిబిరం
- లయన్ డా. బొడ్డు బాబురావు సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి
విశ్వంభర, చిట్యాల : సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా. బొడ్డు బాబురావు అధ్యక్షతన కామినేని హాస్పిటల్స్ ఎల్బీనగర్ హైదరాబాద్ వారి, సౌజన్యంతో (మెగా హెల్త్ క్యాంప్) ఉచిత వైద్య శిబిరం, నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 9న ఆదివారం నాడు ఈ క్యాంపు లో ఉచిత వైద్య పరీక్షలు,సేవలు, బిపి, షుగర్, ఎత్తు, బరువు, బి ఆర్ బి ఎస్, ఉచిత కన్సల్టేషన్, ఆర్థో పిడిషన్, జనరల్ మెడిసిన్, గైనకాలజి, ఆప్తమాలజీ, మరియు డెంటల్, మొదలగు వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కావున మన కమిటీ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు, చిట్యాల మున్సిపాలిటీ, మండల ప్రాంత ప్రజలు ఇట్టి సేవలు పొంది డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి, మంచి ఆరోగ్యవంతులుగా , ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. కామినేని హాస్పిటల్స్ వారి మెగా హెల్త్ క్యాంపును వినియోగించుకుని సద్వినియోగ పరచకోగలరని అన్నారు. పూర్తి వివరాల కొరకు సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, గౌరవ డాక్టరేట్, లయన్ బొడ్డు బాబురావును సంప్రదించాలని కోరారు. స్థలం జడ్పీహెచ్ఎస్, గవర్నమెంట్ హై స్కూల్, వనిపాకల రోడ్, చిట్యాల, మున్సిపాలిటీ. చిట్యాల పుర ప్రముఖులకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, అన్ని ప్రజాసంఘాల, నాయకులకు, ఐక్యవేదిక, సభ్యులందరికీ పాల్గొనాలని కోరారు.



