స్వంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బట్టల పంపిణీ

సర్వశిక్ష అభియాన్

అందరూ చదవాలి అందరూ ఎదగాలి

చేగూర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు బంటారం ఐశ్వర్య మల్లేష్ గౌడ్

ముఖ్య అతిథిగా పాల్గొన్ని బట్టలను పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్

5

విశ్వంభర న్యూస్ :- నందిగామ మండల పరిధిలోని చేగూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేగూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటారం మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బట్టలు,ఐడెంటి కార్డు , బెల్ట్ టైలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తూరు నందిగామ మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ గారు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని అలాగే ఇలాంటి కార్యక్రమాల కోసం అందరూ ముందుకు రావాలని తెలిపారు. మనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని ఇలా ఏదో ఒక దానం చేయడం వల్ల మనకు గుర్తింపు తో పాటు దాన గ్రహీతలు కలకాలం మనల్ని గుర్తుంచుకుంటారని శివ శంకర్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చేగూర్ గ్రామ తాజా మాజీ వార్డు సభ్యులు పబ్బే రవితేజ , కావాలి మదు యాదవ్ , మాజీ వార్డు యాదగిరి గౌడ్ , ఎంపీ శ్రీనివాస్ గౌడ్ , పబ్బే నరేందర్ , అన్నారం నరసింహ , ఎల్లికట్టే  రాజు , మంగలి శ్రీనివాస్ , లెంకపోతుల నరసింహ , ఎంపీ కుమార్ గౌడ్ , బాలరాజు గౌడ్ , మంగలి గిరి , రఘు గౌడ్ , కొత్తూరు రాజు , దొర కృష్ణ , నర్సింగ్ రావు , లాటు ,  పబ్బే చంటి , పబ్బే నరేందర్ , మంగలి నరేష్ , ప్రశాంత్ గౌడ్ ,వెంకట్ చారి , నరేష్ డల్లి  , కిరణ్ గౌడ్ , మహేష్ గౌడ్ , శివ గౌడ్ , కందడ కుమార్, శివ , వెంకట్ స్వామి,ప్రణవ్, ఖరీం తదితరులు పాల్గొన్నారు.

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్