మాజీ V3 న్యూస్  ప్రేసెంటెర్ మారుతి రామ్ కన్నుమూత 

నివాళులు అర్పించిన V3 న్యూస్ ఛానల్ సిఎండి డా. కాచం సత్యనారాయణ 

 మాజీ V3 న్యూస్  ప్రేసెంటెర్ మారుతి రామ్ కన్నుమూత 

విశ్వంభర, ఎల్బీనగర్ :- ప్రముఖ జర్నలిస్ట్ , మాజీ V3 న్యూస్  ప్రేసెంటెర్  మారుతి రామ్ బ్రెయిన్ స్ట్రోక్ తో  మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా. కాచం సత్యనారాయణ వారి భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  గత 20 సం..రాలుగా జర్నలిజం లో విశిష్టమైన సేవలు అందిస్తూ , రిపోర్టర్ , సబ్ ఎడిటర్ , న్యూస్ ప్రేసెంటెర్ , స్టేజి షోస్ యాంకర్ , విశ్లేషకుడిగా ఏ విభాగం అయిన సమర్దవంతంగా రాణించాడు. తన బహుముఖ ప్రజ్ఞాశాలి గా , జర్నలిస్ట్ గా ఎంతో మంది రాజకీయ , ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తల ఇంటర్వ్యూ లలో మంచి పేరును గుర్తింపును తెచ్చుకున్నాడు. ఉత్తమ జర్నలిస్ట్ గా అవార్డులు వరించాయి. ఈ సందర్బంగా V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక యాజమాన్యం , సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు రాజ్ గోపాల్ , దాము మహేందర్ యాదవ్ , అరుణ్ అంబెడ్కర్ తదితరులు పాల్గొన్నారు. 

 

Read More అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 

Tags: