వ్యాసరచనలో"అమూల్య"కు ప్రథమం

 వ్యాసరచనలో

విశ్వంభర,ఇనుగుర్తి: అందరివాడు అంబేద్కర్ అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాల నుంచి ఇనుగుర్తి  విద్యాలయం 9వ, తరగతి బాలిక కోడి రెక్కల అమూల్య ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.కలెక్టరేట్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా అమూల్య బహుమతి ప్రశంసా పత్రం అందుకున్నారు. రావి ఆకులపై అంబేద్కర్, శ్రీరాముని చిత్రాలను రూపుదిద్దడంతో వారు ఆమెను ప్రశంసించారు. దీంతో అమూల్యను విద్యాలయం ప్రిన్సిపాల్ జయశ్రీ ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Tags: