కొమ్ము సింధూరకు ఆర్ధిక సాయం
On
విశ్వంభర, వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన కొమ్ము సింధూర వైద్య విద్యలో మూడవ సంవత్సరం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చదువుతుంది. సింధూరకు నాలుగు సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం పది వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని కాంగ్రెస్ నాయకులు సంజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. హామీలో భాగంగా మొదటి,రెండవ సంవత్సరాలకు గాను ఇరవై వేల రుపాయల ఆర్థిక సాయం గతంలో అంద జేశారు.మూడవ సంవత్సరానికి గాను శనివారం సింధూర తండ్రి కొమ్ము వెంకటయ్యకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజే శారు.ఈ కార్యక్రమంలో రమేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.