పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఈటల రాజేందర్

పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఈటల రాజేందర్

విశ్వంభర, ఇల్లందు : పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. పదేళ్లలో బీఆర్ ఎస్ అధికారంలో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు.

 అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు