ఎరుకల వెదురు హస్తకళా నైపుణ్యం అద్భుతం - ఉల్లంగొడ్ల రాజు

Screenshot 2024-09-19 123320hhh విశ్వంభర, లింగాల : ఎరుకల కులస్తులు వెదురు హస్తకళా నైపుణ్యాలతో ఆర్థికంగా ఎదగాలని నేషనల్ ట్రైబల్ ఫె డరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రం లో మాతృభూమి రూరల్ అభి వృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎరుకల మహిళలకు నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని సందర్శించి వెదురుతో తయారు చేస్తున్న వివిధ డిజైనింగ్ ఆకృతులను పరిశీలించి వాటి ప్రయోజనా లు, సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ ప్రాముఖ్యత కలిగి బహుముఖ ప్రయోజనాలు ఉన్న వెదురు సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మండలంలో ఎరుకల కుల స్తులకు హస్తకళ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్ర మంలో హస్తకళ డిజైనర్ మోహన్, సంస్థ డైరె క్టర్ రమాకాంత్ పాల్గొన్నారు.

Tags: