సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాదిగలకు అన్యాయం: డాక్టర్ పిడమర్తి రవి.

సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాదిగలకు అన్యాయం: డాక్టర్ పిడమర్తి రవి.

 సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారు అన్నారు.తెలంగాణ లో మాదిగలు 12 %ఉన్నారని abcd వర్గీకరణ ద్వారా మాదిగలకు 7%ఇస్తే తీవ్ర అన్యాయం జరుగుతుంది అని అన్నారు. వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లేడు అవ్వడం సంతోషమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సుప్రీంకోర్టులో ఏడుగుర సభ్యుల ధర్మాసనం వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఎస్సి వర్గీకరణకు అనుగుణంగా తీర్పునివ్వడం స్వాగతిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎమ్మార్పీఎస్,బిజెపి కి సంబంధించింది కాదు అని పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసులో తీర్పు వెలువడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద కులమైన మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి వర్గీకరణ చేయాలని అన్నారు. బిజెపి పార్టీ వర్గీకరణ హామీ నెరవేర్చుకోలేదని మాదిగలను మోసం చేసిన జాతీయ పార్టీ బిజెపి మాత్రమేనా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ వేసి వర్గీకరణ అంశాన్ని చట్టసభల్లో ప్రస్తావించిందని కానీ బిజెపి మాత్రం చట్టసభలో వర్గీకరణ గురించి మాట్లాడలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తాననడం చాలా సంతోషకరమని రేవంత్ రెడ్డి గారికి మాదిగల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతిగా ఉన్నందుకు మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ ,నేషనల్ దళిత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భుదాల బాబురావు, తెలంగాణ తల్లిదండ్రు రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు, బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాదిగ జేఏసీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు నక్క మహేష్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జెర్రిపోతుల సాయన్న మాదిగ, జేఏసీ నాయకులు దేవరకొండ నరేష్ జోగు గణేష్ జనపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.