మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ -బిజెపి
విశ్వంభర, నల్గొండ జిల్లా : డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం పుల్లెంల గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు సముచిత గౌరవం దక్కేలా చేయడంతో పాటు, ఆయన ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోంది ప్రధానమంత్రి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు ,పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ , జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి గౌడ్ , బూతరాజు శ్రీహరి , రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి , బిజెపి మండల నాయకులు శివర్ల యాదయ్య , చెరుకు లింగయ్య , జెట్టి యాదయ్య , నలపరాజు యాదగిరి , మాదగోని వెంకన్న, ఇరిగి శివ , ఐతగొని శ్రీనివాస్ , గుండెబోయిన దిలీప్ , పులిజాల రవీందర్ , ముక్కాముల సైదులు , నకిరేకంటి రఘు గౌడ్ , బోయపల్లి సత్తయ్య పాల్గొన్నారు.



