బాసర IIIT లో సీటు సాదించిన సన్ షైన్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ కోడి వెంకన్న
On
సొంత ఊరికి , తల్లి తండ్రులకు , చదువుకున్న పాటశాలకు గొప్ప పేరు తీసుకొని రావాలి
చండూర్, విశ్వంభర :- సన్ షైన్ స్కూల్ విద్యార్థిని T రమ్యశ్రీ బాసర IIIT లో సీటు సాధించినందుకు గాను సన్ షైన్ స్కూల్ కరెస్పాండెంట్ కోడి వెంకన్న పాఠశాల ఆవరణంలో విద్యార్థుల ముందు ఘనంగా సన్మానించారు .ప్రతి ఒక్కరు లక్ష్యంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకొని సొంత ఊరికి , తల్లి తండ్రులకు , చదువుకున్న పాటశాలకు గొప్ప పేరు తీసుకొని రావాలని అన్నారు .సన్ షైన్ పాఠశాల విద్యార్థులు ప్రస్తుతం అన్ని రంగాలలో ఉన్నతమైన హోదాలో ఉన్నారని గుర్తు చేస్తూ తన స్కూల్ విద్యార్థులకు తెలియపరిచారు.బాసర IIIT లో సీటు సాధించిన విద్యార్థిని T రమ్య శ్రీ ని కోడి వెంకన్న అభినందిస్తూ , సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కోడి సుష్మ , విద్యార్థిని తల్లి తండ్రులు పాల్గొన్నారు .