మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
On

విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మరో 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గ్రామ సీనియర్ నాయకులు మిన్నాల డేవిడ్ రేణు రెడ్డి వార్డ్ మెంబర్ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు



