చైతన్య ఆర్థో కేర్ – ప్రజల  ఆరోగ్యానికి కొత్త చిరునామా

చైతన్య ఆర్థో కేర్ – ప్రజల  ఆరోగ్యానికి కొత్త చిరునామా

విశ్వంభర, హైదరాబాద్‌ :- నగరంలోని ఓల్డ్ బోయిన్ పల్లి ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన చైతన్య ఆర్థో కేర్ క్లినిక్ ప్రజలలో విశ్వాసాన్ని కలిగిస్తోంది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. గోపిసెట్టీ చైతన్య కిషోర్  ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఆధునిక వైద్య పద్ధతులతో ఎముకలు, జాయింట్లు, మరియు నరాల సమస్యలకు సమగ్ర చికిత్స అందిస్తోంది. డా. చైతన్య కిషోర్  మాట్లాడుతూ – “మా లక్ష్యం ప్రతి వ్యక్తికి చేరువలో ఉన్న నాణ్యమైన ఆర్థోపెడిక్ చికిత్స అందించడం. శరీర నొప్పులు, కీళ్ల సమస్యలు, స్పైన్ సమస్యలపై సమయానికి చికిత్స తీసుకుంటే భవిష్యత్‌ సమస్యలను నివారించవచ్చు” అని అన్నారు. చైతన్య ఆర్థో కేర్ లో అత్యాధునిక సదుపాయాలు, ఫిజియోథెరపీ సేవలు, మరియు శస్త్రచికిత్స తర్వాత పునరావాసం వంటి సేవలు లభిస్తాయి.  ప్రజలకుసౌకర్యవంతంగా ఉండేందుకు క్లినిక్‌ ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 7.30 నుండి 9.30 వరకు పనిచేస్తుందని వారు తెలిపారు.

Tags: