పశువులకు టీకాలు వేయించాలి

పశువులకు టీకాలు వేయించాలి

విశ్వంభర, గుండాల : గుండాల మండలం కేంద్రంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని సర్పంచ్ దేవనబోయిన ఐలయ్యప్రారంభించారు.  సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 195 పశువులకు టీకాలు వేసారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్,  మండలం పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్.  వి ఏ రాజు, గోపాలమిత్రలు గోవింద్, కృష్ణ , శ్రీను, నరేష్, శేఖర్, రైతులు పాల్గొన్నారు

Tags: