ఎమ్మెల్సీ ఓట్లను కొనేందుకు బీఆర్ఎస్ చూస్తోంది...ఈసీకి రఘునందన్ రావు లేఖ

ఎమ్మెల్సీ ఓట్లను కొనేందుకు బీఆర్ఎస్ చూస్తోంది...ఈసీకి రఘునందన్ రావు లేఖ

విశ్వంభర, హైదరాబాద్ : ఈ నెల 27న సోమవారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల 
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రంలోని కీలక పార్టీలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే రూ. 30 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ పట్ట భద్రుల ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని...దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.


 దీనిపై కేంద్ర ఎన్నికల కమిషనర్, సీఈవోకు లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్లను కొనుగోలు చేస్తుందని,...లేఖతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల వివరాలను జత చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగడం కోసం వెంటనే బీఆర్ఎస్ ఖాతాలలో ఉన్న డబ్బులు ఫ్రీజ్​ చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Read More  రోశయ్య వర్ధంతి సభకు తరలిరావాలి - మీడియా కమిటీ ఛైర్మన్ కౌటిక విఠల్