ప్రజా సమస్యలే బిజెపిని గెలిపిస్తుంది:- బిజెపి నాగర్ కర్నూల్  జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు

స్థానిక ఎన్నికల్లో ప్రజల చూపు బిజెపి వైపు

ప్రజా సమస్యలే బిజెపిని గెలిపిస్తుంది:- బిజెపి నాగర్ కర్నూల్  జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు

విశ్వంభర, చారగొండ :  మండల కేంద్రంలోని  సాయి తిరుమల ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానిక ఎన్నికలు మన పార్టీకి అత్యంత కీలకం అని  మన ప్రాంత ప్రజల ఆశలు, ఆశయాలు మన పార్టీ పైనే ఉన్నాయి.  మనం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాం,  ప్రతి ఇంటికి వెళ్లి మన పార్టీ చేసిన అభివృద్ధి పనులను మనం రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలను మనం చెప్పి మన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకోవాలని ప్రజలకు మనము ఎప్పుడూ అందుబాటులో ఉంటే ప్రజలంతా మన వైపు చూస్తారు అని అన్నారు.  ఈ ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి మనం కృషి చేస్తే వారిలో ఒకరిగా కలిసిపోవాలి.  నిజాయితీ నిబద్ధతతో పని చేస్తేనే ప్రజల మద్దతు లభిస్తుంది.  మన గెలుపు మన పార్టీ గెలుపు మన ప్రాంత ప్రజల గెలుపు కావాలని మనమందరం అహర్నిశలు కష్టపడి మన ఐక్యత మన బలం, మనం కష్టపడితే విజయం మనదే, ప్రజలకు సేవ చేయడమే మన లక్ష్యం ఎన్నికల్లో మనం సత్తా చాటుదాం రానున్న రోజుల్లో ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లో పెద్ద ఎత్తున విజయం సాధించి తీరుతామని వారు మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి , మాజీ మండల అధ్యక్షులు వెంకటయ్య గౌడ్,  నాయకులు రవి నాయక్,  వేణుశర్మ, హరిబాబు, కొండల్ వెంకటయ్య, శ్రీకాంత్, నోముల శంకర్ గౌడ్ నోముల లక్ష్మీనారాయణ గౌడ్ రామకృష్ణ గౌడ్ , శ్రీను, ఫుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

 

Read More చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.

Tags: