చట్టాలపై అవగాహన సదస్సు ..
On
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పీయస్ పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ప్రజలకు చట్టాలపై ఎస్సై మురళీధర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాం నాథ్ కేకన్ ఆదేశాలతో గ్రామ గ్రామానికి పోలీస్ సేవల పై, ప్రజలకు చట్టాలపై అవగాహన,సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన, రోడ్డు భద్రతా ప్రమాణాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎస్సై. గ్రామస్తులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.