ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం

ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్ రెడ్డి రాంరెడ్డి

ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం

 నాగోల్  విశ్వంభర :మాజీ టూరిజం కార్పొరేషన్​ చైర్మన్​ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి ఆధ్వర్యంలోనాగోల్ లోని వారి నివాసంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్ రెడ్డి రాంరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగతంగా తనకు చిన్నప్పటి నుంచి ఆర్యవైశ్యులతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రతీ ఆర్యవైశ్యుడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేద ఆర్యవైశ్యులను ఆదుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని విఙ్ఞప్తి చేసారు.

     ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, పబ్బ చంద్రశేఖర్, నాగోల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మంజుల రెడ్డి, డా. ఏఆర్ గుప్త, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

Tags: Nagole