అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అనుసరణీయం
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
విశ్వంభర,నల్గొండ: దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత సమ సమాజ స్వాప్నికుడు ,భావితరాలకు స్ఫూర్తి ప్రదాత డా"బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతినీ దామరచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్ లు పాల్గొనిఅహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధన దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని,ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే ఇందుకు మేలిమి ఉదాహరణలుగా పేర్కొన్నారు.అంబేద్కర్ కోరుకున్న సమానత్వం, సామాజిక న్యాయ సాధనలో ఈరోజు మరో కీలక ముందడుగు పడిందన్నారు.ఆ మహనీయుని జయంతి నాడే, దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల సంపూర్ణంగా నెరవేరుతుండడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నాడు తెలంగాణ రాష్ట్ర కల నెరవేరిందని, సాధించుకున్న తెలంగాణలో ఈరోజు వర్గీకరణ ఆకాంక్ష సాకారమైందన్నారు.పేదింటిలో పుట్టి స్వయం కృషితో ఎదిగి, జీవితాంతం బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలిచిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అనుసరణీయమని గారు పేర్కొన్నారు.అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్చగా ఆత్మగౌరవంతో బతకడం అలవర్చుకోవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.మంచి నడవడిక, విద్య, ఆర్థిక స్వావలంభన ఆత్మగౌరవానికి పునాదులు అని పేర్కొన్నారు.రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్,యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల నరసింహ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు ధనావత్ సిద్దు నాయక్,ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు, అధికారులు బి ఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.



