ALERT: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు..!
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట లభించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట లభించింది. సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. DRF బలగాలు సిద్ధంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మీ అదేశాలు జారీ చేశారు.
కాలువలు, మ్యాన్ హోల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా నగరంలో మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు ఒక గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. కుత్బుల్లాపూర్‌లో 0.55 సెంటీ మీటర్లు, కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో 0.43 సెంటీ మీటర్లు, బాలాజీనగర్‌లో 0.28 సెంటీ మీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది.
దీంతోపాటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్ పేట, సికింద్రాబాద్, రాయదుర్గ, ఉప్పల్, ఎల్‌బినగర్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, నారాయణ గూడ పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రాయదుర్గం, జూబ్లీహిల్స్ బంజారాహిల్ష్, పంజాగుట్ట ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో మరో ఐదు రోజుల తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ వాఖ వెల్లడించింది. గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.