హైదరాబాద్​ లో వర్షం... నవ్వుతున్న మీమ్ షేర్ చేసిన మెట్రో

హైదరాబాద్​ లో వర్షం... నవ్వుతున్న మీమ్ షేర్ చేసిన మెట్రో

హైదరాబాద్, సికింద్రాబాద్  నగరంలో ఆకాల వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తుంటాయి. ఈ వరదలో వాహన దారులు, ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతూ..ట్రాఫిక్ ను ఎదుర్కొంటూ ఎట్టకేలకు తమ గమ్యానికి చేరుకుంటారు.

విశ్వంభర, వెబ్ డెస్క్ : హైదరాబాద్, సికింద్రాబాద్  నగరంలో ఆకాల వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తుంటాయి. ఈ వరదలో వాహన దారులు, ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతూ..ట్రాఫిక్ ను ఎదుర్కొంటూ ఎట్టకేలకు తమ గమ్యానికి చేరుకుంటారు. తాజాగా కాసేపటి క్రితం జంటనగరాల్లో పలు చోట్ల వాన పడింది. అయితే దీనిపై మెట్రో వినూత్నంగా స్పందించింది. 

హైదరాబాద్ లో వర్షం పడుతే ప్రయాణించే వారికి ఇప్పుడు పెద్ద ఇబ్బందేమీ కాదని, ట్రాఫిక్ ను అవాయిడ్ చేయాలని, స్టే డ్రై,ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా మెట్రోలో జర్నీ చేయొచ్చని తెలుపుతూ..ఓ ట్వీట్ చేసింది. అందులో అయ్యో ట్రాఫిక్ లో చిక్కుకు పోవాల్సిందే అని సహోద్యోగి బాధ పడితే మెట్రోలో వెళ్లే నేను ఇలా నవ్వుకుంటాను అంటూ బ్రహ్మానందం వీడియోతో మీమ్ చేసి ఎక్స్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతుంది.

Read More పాల్వాయి రాజేష్ కు  వైద్యశాఖలో పదోన్నతి