ఘనంగా వనస్థలిపురం జాతిరత్న పురస్కారాలు -

బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్  గద్దె విజయ్ నేత - వనస్థలిపురం భక్త సమాజం

ఘనంగా వనస్థలిపురం జాతిరత్న పురస్కారాలు -

విశ్వంభర, వనస్థలిపురం :- సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వనస్థలిపురంలోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ హాల్ లో యువ నేత  బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్  గద్దె విజయ్ నేత సారధ్యంలో వనస్థలిపురం భక్త సమాజం నిర్వహించిన వనస్థలి జాతి రత్న పురస్కార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దలను గౌరవించి సన్మానించారు. యువకులను ఆటల ద్వారా ప్రోత్సహించి బహుమతిలిచ్చి రాబోవు తరాన్ని సంప్రదాయ  కళలలో నైపుణ్యాన్ని పెంచడం కోసం సంప్రదాయ కూచిపూడి నృత్యాలతో ఈ కార్యక్రమం పెద్దతరం, యువతరం, నవతరం కలసి  మూడు తరాల  సమన్వయంగా సాగింది. ముందుగా  మువ్వ బాబూరావు భక్తి పాటలతో కార్యక్రమం ప్రారంభమై తదుపరి సందేశాత్మకమైన షార్ట్ ఫిలిమ్స్ ప్రజెంటేషన్ జరిపి, చిన్నారులుచే కూచిపూడి నృత్యం ప్రదర్శనలు  ప్రేక్షకులను, సన్మాన గ్రహీతలను అతిధులను అలరించాయి. తదుపరి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వి సూర్యప్రకాష్ వనస్థలిపురం భక్త సమాజం తరఫున, విజయనేత ను  వేదిక మీద ఆహ్వానించి గౌరవ అతిధులను అందరిని పేరుపేరునా వేదిక మీదకు ఆహ్వానించి 18 మందిని  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పురస్కార గ్రహీతలను గౌరవ అతిధుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించి వారికి వనస్థలి జాతి రత్నాలుగా బిరుదు ప్రధానం చేసి సత్కరించడం జరిగింది. యువకులచే ఆటలాడించి విజేత లైన ఈ కార్యక్రమంలో వారికి ప్రధమ, ద్వితీయ , తృతీయ బహుమతులను అందజేశారు.  పురస్కార గ్రహీతలకు, బహుమతి గ్రహీతలకు, గౌరవ అతిధులకు వేద పండితుల చేత ఆశీర్వచనం చేసి , రాబోవు సంక్రాంతి ఆనందంగా ఉత్తరాన పుణ్యకాలంలో అందరూ సుఖ సంతోషాలతో  ఉండాలని వేద పండితులు ఆశీర్వదిస్తూ కార్యక్రమం అధ్యంతం జనాకర్షణగా ఆధ్యాత్మికంగా సాగింది. ఈ కార్యక్రమానికి కె లక్ష్మీయ్య, పింగళి సాంబశివరావు , సిహెచ్ మంగపతి రావు ,  జిని శ్రీలత , ఎంపీ ఎన్ వర్ధన్ , ఎం సత్యనారాయణ , విపికే బసవయ్య , పి గోపాల్ రెడ్డి , గద్దె విజయనేత ,  గౌరవ అతిథులుగా, అతిథులుగా పాల్గొని, వీరి చేతులు మీదుగా వనస్థలి జాతి రత్న పురస్కారాలు పొందినవారు డాక్టర్  పి.టి.జీవి రంగాచార్యులు, రుక్మిణి నాగేశ్వరరావు , పర్వత వర్ధని,  జడ్జి కృష్ణమూర్తి, ఎం ఎస్ కే ప్రభు, బీడీఎల్ సత్యనారాయణ, నూకల ప్రభాకర్ శర్మ, పీవీకే సోమయాజులు , పి కృష్ణది శేషు,  వేముల జయరాం, ఈమని కృష్ణారావు, వెంకటకృష్ణారెడ్డి,  మల్లేష్ యాదవ్ బెల్లి , వీరందరినీ గౌరవ అతిథులు ఘనంగా మెమెంటోళ్ళతో దండలతో శాలువాలతో సత్కరించి వనస్థలి జాతి రత్న పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సచివాలయ నగర్ సభ్యులు ఎన్జీవోస్ కాలనీ సభ్యులు వివిధ కాలనీ  సభ్యులందరూ వనస్థలిపురం సంఘాల  తరపున ప్రతినిధులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు  విజయ నేతను అందరూ అభినందించి వనస్థలిపురం భక్త సమాజం మరింత మంచి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని వక్త లందరూ ప్రసంగిస్తూ ఇంతమంది పెద్దల్ని సన్మానించి సత్కరించే కార్యక్రమం వనస్థలిపురంలో ఇంత పెద్దగా జరగడం ఇదే మొదటిదని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ, వచ్చిన వారందరికీ, గౌరవ అతిధులకు, పురస్కార గ్రహీతలకు,  వార్తాపత్రిక ప్రతినిధులకు,  ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ వనస్థలిపురం భక్త సమాజం తరఫున సి హెచ్ వి ఆర్ కె మూర్తి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గద్దె  విజయనేత దంపతులను సన్మానించారు. 

Tags: