కుందన్ బాగ్ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వీనర్ మణిదీప్
On
ప్రజా విశ్వంభర, హైదరాబాద్: బేగంపేట కుందన్ బాగ్ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వీనర్ మణిదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయతను తట్టి లేపేలా నిర్వహించిన పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అపార్ట్ మెంట్ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా మణిదీప్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామని, వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.



