తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి-SFI

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విద్యారంగంపై ప్రత్యేక చర్చ జరపాలి-SFI

WhatsApp Image 2024-07-24 at 10.47.05_18d3f9d2

విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశo నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్  హాజరైనారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా  అనేకమైనటువంటి సమస్యలతో విద్యారంగo సతమతమవుతున్న విషయం ప్రభుత్వానికి పట్టదా అని  ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి ఈ నెలలో నిర్వహించే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో 30% నిధులు కేటాయించాలని  డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ గాని, ఫీజు రియంబర్స్మెంట్ 8వేల కోట్లకుపైగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి అన్నారు.కేజీబీవీ హాస్టల్స్ లో అప్డేట్ చేశామని ప్రభుత్వం చెబుతుంది కానీ కేజీబీవీ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు  లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.సరిపడా క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే సంక్షేమ హాస్టల్లో పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు . తక్షణమే ఈ సమస్యలను అన్నిటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సమస్యల పరిష్కారానికి తగు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోమాత నరేష్, జిల్లా కమిటీ సభ్యులు స్వామి, ఈశ్వర్, అఖిల్, శివ, కేశవ తదితరులు పాల్గొన్నారు.

 

Read More రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అధికార పార్టీకేనా?