114 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పోరాట స్ఫూర్తితో స్రీ పురుష సమానత్వం కోసం పోరాడుదాం

114 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  •  ఎ.ఐ.యప్.డి.డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుద
  •  రాష్ట్ర బడ్జెట్లో 20% నిదుల సాధనకై పోరాటాలు ఉదృతం చేయాలి
  •  యం.సి.పి.ఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు

విశ్వంభర, హైదరాబాదు: శనివారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఎ.ఐ.యప్.డి.డబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బడ్జెట్లో మహిళా సంక్షేమానికి 20 శాతం నిదులు కెటాయించాలనె డిమాండ్ తో రాష్ట్ర సదస్సు బాగ్ లింగం పల్లి ఓంకార్ భవన్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంగడి పుష్ప అధ్యక్షతన జరిగింది.
 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వంగల రాగసుద మాట్లాడుతూ స్వాతంత్ర్య దేశంలో నేడు స్రీ అన్ని రంగాల్లో అణిచివేతకు గురి అవుతుంది అని, ఇప్పటికీ 114 అంతర్జాతీయ మహిళా దినోత్సవం లు జరిగిన భారతదేశంలో పాలకులు స్రీ హక్కుల పరిరక్షణ, భద్రతలో ఘోరంగా వైఫల్యం చెందారు అని, 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి రోజు రోజుకు స్రీ ని బానిస సమాజం నాటి స్థితికి నెట్టి వేసే కుట్రలు అనేకం చేస్తుంది అని, స్రీ బానిసగా ఇంట్లో పడి ఉండాలి అని ఆదేశిస్తున్నది అని, ఈ విదానాన్ని నేటి మహిళ సమాజం సావిత్రి భాయి పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టాలని, స్రీ పురుష సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ రాష్ట్ర మహిళా సదస్సు ను ఉద్దేశించి యం.సి.పి.ఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మహిళా సంక్షేమానికి 20 శాతం నిదులు కెటాయించాలని గ్రామ స్థాయి నుంచి మహిళలను ప్రోత్సహించడం, ప్రశ్నించే చైతన్యం కల్పించటం ఎ.ఐ.యప్.డి.డబ్ల్యూ నాయకత్వం, కార్యకర్తలపై ఉందని ఈ అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవ స్పూర్తితో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ సధస్సులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు అంగడి పుష్ప, రాష్ట్ర కోశధికారి తాండ్ర కళావతి, కనకం, సంధ్య, మాస్ సావిత్రి, సిహెచ్‌. లీల, జి. శివాని, విమల, అనిత, ఇందిరా, గీత, లక్ష్మి, భార్గవి, బిందు, లలిత, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Tags: