ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శాంతినికేతన్ ఫౌండేషన్ లో అల్పాహారం అన్నదానం
On
విశ్వంభర, వనస్థలిపురం : ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతినికేతన్ ఫౌండేషన్ లో అల్పాహారం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సామజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం బాలలందరినీ బడికి పంపించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. భారత దేశంలో ఎంతోమంది ఆహారం అందక చనిపోతున్నారు. అనాధలను పేదలను బాల కార్మికులను వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతో ఈ సమాజం పైన ఉందని గుర్తు చేశారు. పుట్టినరోజులు ఈ ఆశ్రమంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జగడం సుజాత, రామకృష్ణ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాంతినికేతన్ ఫౌండేషన్ లగిశెట్టి బాలేశ్వర్, సొసైటీ సభ్యులు చేపూరి సునీత, జగడం చంద్రశేఖర్, సంధ్యా, కీర్తి, ఆకాష్, యోగిత, వార్డెన్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.