ప్రాణాలతో ఉంటా అనుకోలేదు: స్టార్ క్రికెటర్ 

ప్రాణాలతో ఉంటా అనుకోలేదు: స్టార్ క్రికెటర్ 

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ బాగా ఆడటంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ బాగా ఆడటంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఓ షోలో తనఅనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. 

పంత్ మాట్లాడుతూ.. ‘రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని చాలా మార్చింది. ఆ సమయం ఎంతో అనుభవం నేర్పింది. తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించా. అది నరకంగా అనిపించింది. దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయాను. వీల్‌చైర్‌లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేది. భయంగా ఉండేది. అందుకే ఎయిర్‌పోర్టుకు వెళ్లలేకపోయా. కానీ, భగవంతుడు రక్షించాడు’ అని రిషబ్ పంత్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

Read More టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

అయితే, 2022 డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టి మరోసారి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా