క్లింకార కోసం రామ్ చరణ్‌ కీలక నిర్ణయం.. నిర్మాతలకు షాక్ తప్పదా..?

క్లింకార కోసం రామ్ చరణ్‌ కీలక నిర్ణయం.. నిర్మాతలకు షాక్ తప్పదా..?

 

మెగా వారసుడిగా రామ్ చరణ్‌ ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్‌. అయితే ఇన్నేండ్లు రామ్ చరణ్‌ వరుసగా షూటింగులకు హాజరయ్యేవాడు. దాంతో కుటుంబంతో పెద్దగా సమయం గడిపేవాడు కాదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్‌ కు ఓ కూతురు ఉంది. 

Read More యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్

పెళ్లైన పదేండ్ల తర్వాత రామ్ చరణ్‌-ఉపాసన దంపతులకు క్లింకార పుట్టింది. అందుకే ఇప్పుడు తన కూతురు కోసం రామ్ చరణ్‌ ఓపెద్ద నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపాడు. ఇక నుంచి నా కూతురు క్లింకార కోసం కొంత టైమ్ కేటాయించాలని అనుకుంటున్నాను. 

వరుష షూటింగుల వల్ల క్లింకారను వదిలి వెళ్లలేకపోతున్నాను. కాబట్టి కొన్నాళ్లు నా కూతురు కోసం నెమ్మదిగా సినిమాలు చేస్తాను. ఎందుకంటే నా కూతురుకు నేను బానిస అయిపోయాను. ఆమె కోసం కొన్నాళ్ల పాటు సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యాను. లోకల్ లో షూటింగ్స్ ఉంటే కచ్చితంగా సాయంత్రం 6 గంటల లోపే ఇంటికి వచ్చేస్తాను. నా నిర్మాతలకు కూడా ఇదే విషయం చెబుతాను అంటూ తెలిపాడు రామ్ చరణ్‌. తన కూతురు స్కూల్ కు వెల్లేదాకా అలాగే వెళ్తానని తెలిపారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా