టీమిండియా కోచ్ పదవికి మోడీ, అమిత్‌షా పేరుతో ఫేక్ దరఖాస్తులు

టీమిండియా కోచ్ పదవికి మోడీ, అమిత్‌షా పేరుతో ఫేక్ దరఖాస్తులు

కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకుల పేర్లతో భారీ ఫేక్ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.  

టీమిండియా కోచ్ పదవికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా పేర్లతో ఫేక్ దరఖాస్తులు చేయడం చర్చనీయాంశమైంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకుల పేర్లతో భారీ ఫేక్ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.  భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. 

కొత్త కోచ్ కోసం బీసీఐ అప్లికేషన్లను ఆహ్వానించగా మార్చి 27వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే దాదాపు 3వేల వరకు దరఖాస్తులు రాగా ఇందులో మెజార్టీ దరఖాస్తులు ఫేక్ సమాచారంతో వచ్చినవిగా గుర్తించారు. అందులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా పేర్లతో పాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, సెహ్వాగ్, హర్భజన్ సింగ్ పేరిట దరఖాస్తులు వచ్చాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

వీటన్నింటినీ ఫేక్ దరఖాస్తులుగా తేల్చినట్లు స్పష్టం చేశారు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 30 టెస్టులతో పాటు 50 టెస్టులు ఆడి ఉండాలి. 60ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని బీసీసీఐ షరతులు విధించింది. అయితే క్రికెట్ కోచ్‌పై ఆసక్తిగా ఉన్న క్రికెటర్ల పేర్లను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. టీమిండియా కోచ్ రేసులో లక్ష్మణ్‌తో పాటు గౌతమ్ గంభీర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సివుంది.

Related Posts