టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం

 

ఆసిస్ జట్టు అహంకార పూరిత మాటలను మాత్రం వదలట్లేదు. ఇప్పటికే పలుమార్లు ఇండియా మీద ఇలాంటి కామెంట్లు చేసింది ఆసిస్ టీమ్. ఇప్పుడు తాజాగా ఆసిస్ టీమ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా తమ కంటే అన్ని విధాలుగా చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ తో ఆసిస్ జట్టు ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. 

21 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆసిస్ జట్టు మీద రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం మిచెల్ మార్ష్‌ మాట్లాడుతూ.. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి మమ్మల్ని ఓడించింది. పిచ్ పరిస్థితులను బట్టి ఏ జట్టు అయినా సరే టాస్ గెలిచాక ఫీల్డింగ్ ఎంచుకుంటాయి. 

ఈ రోజు మా ఇరువురి జట్లకు పిచ్ అనుకూలించింది. కాకపోతో ఓడిపోయాం. ఇక తర్వాత ఇండియాతో తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే మాకు గెలవడానికి ఇండియా కంటే మెరుగైన జట్టు మాకు దొరకదు. టీమ్ ఇండియాపై మేం గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్ చేశాడు. అయితే టీమ్ ఇండియా ఓడిపోయే టీమ్ అనే విధంగా ఆయన చేసిన కామెంట్ మీద ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts