ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ పోస్టర్ లాంచ్

ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ పోస్టర్ లాంచ్

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ( డీట్) ,  గుర్తింపు ఫౌండేషన్ మరియు వీవ్ మీడియా  ఆధ్వర్యంలో  ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. కాగా హైడియాథన్ పోస్టర్ లాంచ్ స్థానిక డీట్ ఆఫీసు లో డీట్ డైరెక్ట్ ఈ.ఆర్. జనార్దన్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ పి.ఆర్. వంశీ  మరియు వీవ్ మీడియా టీం లాంచ్ చేశారు. వీ హబ్ సీఈఓ సీత చేతుల మీదుగా వీ హబ్ ఆఫీస్ లో కూడా లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా 18 - 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ మరియు యువ ఇన్నోవేటర్స్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. గెలిచిన వాళ్ళకి లక్ష రూపాయల ప్రైజ్ మనీ తో పాటు , అప్ స్కిల్లింగ్, ఇంకుబేషన్ సపోర్ట్, ఫండింగ్ సపోర్ట్ అందిస్తున్నామని గుర్తింపు ఫౌండేషన్  డైరెక్టర్ నరేంద తెలిపారు.అంతే కాక డీట్ పోర్టల్ లో నమోదు అయిన స్టూడెంట్స్ తో పాటు వివిధ రంగాల ప్రొఫెషనల్ పీపుల్ కి, గ్రామీణ ప్రాంతాల యువతకు  వివిధ కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వంశీ గారు తెలిపారు.WhatsApp Image 2025-06-27 at 10.37.36 AM (1)

Read More బీసీ బంద్ విజయవంతం - రాపోలు జ్ఞానేశ్వర్ 

తెలంగాణ టూరిజం , కల్చరల్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సహకారం తో గత మూడేళ్లుగా వివిధ రంగాలలో దాదాపు 225 మంది ప్రముఖులను ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ తో సత్కరిస్తూ వస్తున్న వీవ్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తన సి.ఎస్.ఆర్ లో భాగంగా ఇప్పటికే దాదాపు 75 మంది దివ్యాంగులకు అప్ స్కిల్లింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పిస్తుందని, వరల్డ్ ఎంట్రప్రెన్యూర్ డే సందర్భంగా నాల్గవ సంవత్సరంలో స్టార్టప్స్, ఇన్స్టిట్యూట్, కార్పొరేట్ సంస్థలు కు అవార్డులు అందించడానికి నామినేషన్ ఆహ్వానిస్తుందని,  ఇందులో భాగంగా యువ ఇన్నోవేటర్స్ ను ప్రోత్సహించదానికి హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్  నిర్వహిస్తుందనీ ,రిజిస్ట్రేషన్ కోసం www.deet.telangana.gov.in వెబ్సైట్ విజిట్ చేయాలి. ఈ నెల 26 నుంచి జూలై 6 వరకు చివరి తేదీ అని తెలిపారు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ పీ.ఆర్. వో సిమి.ఈ  స్టార్టప్ కాంపిటీషన్ కు టాస్క్ స్కిల్లింగ్ పార్టనర్ కాగా,  వీ హబ్ ఎకో సిస్టమ్ పార్టనర్, బిగ్ టీవీ, బిగ్ ఎఫ్ .ఏం మీడియా గా ఉన్నారు.WhatsApp Image 2025-06-27 at 10.37.36 AM

Tags: