ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే  లేదు...తేల్చి చెప్పిన స్వాతి మాలీవాల్

ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే  లేదు...తేల్చి చెప్పిన స్వాతి మాలీవాల్

విశ్వంభర, ఢిల్లీ : ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే ఖచ్చితంగా పదవి నుంచి వైదొలిగెదాన్నన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో... ఇప్పుడు పదవికి రాజీనామా చేసేదే లేదని తేల్చి చెప్పారు. 

 "ఆప్ ను స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించాను. 2006లో వీరితో కలిసి పని చేసేందుకు వీలుగా నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. అప్పుడు మా సంస్థలో ముగ్గురే ఉండేవారు. వారిలో నేను ఒకరిని. ఎవరికైనా నా రాజ్యసభ సీటు కాలవాలంటే నన్ను అడగాలి. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాను. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఆప్ లో చేరినప్పటి నుంచి ఎటువంటి పదవీ కోరలేదు. కానీ, వారు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయను " అని మాలీవాల్ పేర్కొన్నారు.

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Related Posts