సొంతగడ్డపై సన్‌రైజర్స్ విధ్వంసం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం!

సొంతగడ్డపై సన్‌రైజర్స్ విధ్వంసం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం!

సొంతగడ్డపై మరోసారి తన ప్రతాపం చూపిన సన్ రైజర్స్.. పంజాబ్ ను మట్టి కరిపించింది. దీంతో.. పాయింట్ల పట్టిలో రెండో స్థానానికి చేరుకుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 215 రన్స్ టార్గెట్‌ను 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 214 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసి విజయం సాధించింది. 

బ్యాటింగ్‌కి దిగిన తొలి బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. కానీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిజాప్పాయింట్ చేయకుండా పంజాబ్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో ఏకంగా 66 పరుగులు చేశాడు. ఓవైపు అభిషేక్ చెలరేగుతుంటే.. తన పార్టనర్ రాహుల్ త్రిపాఠి కూడా పట్ట పగలే బౌలర్లకు పంజాబ్ కు చుక్కలు చూపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సెక్సులు బాది 33 పరుగులు చేశాడు. 

Read More పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

ఇక మన తెలుగు తేజం నితీశ్ రెడ్డి కూడా గట్టిగానే బ్యాట్ కి పని చెప్పాడు. 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులు చేశాడు. మొత్తానికి సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ ను చిత్తు చేశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించిన సన్ రైజర్స్ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి.

Related Posts