వయనాడ్ ప్రజలకు రాహుల్ ప్రేమలేఖ

వయనాడ్ ప్రజలకు రాహుల్ ప్రేమలేఖ

  • మీ ప్రేమే నన్ను కాపాడింది.. అండగా ఉంటా 
  • విద్వేషం, హింసపై పోరాటం కొనసాగిస్తా
  • మీ ప్రతినిధిగా నా సోదరి వస్తోంది 
  • కేరళలోని వయనాడ్‌ను వదులుకోవడంపై రాహుల్ గాంధీ భావోద్వేగం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండింటిలో ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన వయనాడ్‌ను వదులుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో  వయనాడ్ ప్రజలకు రాహుల్ భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. 

‘‘ప్రియమైన వయనాడ్ సోదర సోదరీ మణులారా.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని కలిశాను. మీ మద్దతు కోరేందుకు తొలిసారి వచ్చాను. అయినా నాపై ప్రేమ, ఆప్యాయతతో హత్తుకున్నారు. నేను వేధింపులను ఎదుర్కొంటున్న సమయంలో ఎదురైన పరిస్థితుల్లో మీరుచూపిన ప్రేమే నన్ను కాపాడాయి. నాకు ఆశ్రయం కల్పించి ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. వేలాదిమంది ఎదుట తన ప్రసంగాలను అనువాదం చేసేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరవనితల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలను. మీకందరికీ మాటిస్తున్నా దేశంలో విద్వేషం, హింసపై పోరాటం కొనసాగిస్తా. మీకు ప్రతినిధిగా నా సోదరి ప్రియాంకాగాంధీ వస్తోంది. ఇక నాకు ధైర్యంగా ఉంది. వయనాడ్‌ ప్రజలంతా తన కుటుంబసభ్యులని ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాను. ధన్యవాదాలు..’’ అంటూ రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.

Read More హైద్రాబాద్ లో  నేషనల్ బడ్డింగ్ ప్రొఫెషనల్ - చెఫ్ కాంపిటీషన్స్ 2024