సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం: కంగనా రనౌత్

సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం: కంగనా రనౌత్

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఎన్నికల ప్రచారం  కోసం పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా అభిప్రాయపడింది. ‘‘వరుసగా ఆరు ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, పర్వత ప్రాంతాల్లో కష్టమైన రహదారులపై 450 కిలోమీటర్ల మేర ప్రయాణం, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం తీసుకోకపోవడం.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. ఈ క్లిష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివే’’ అని కంగనా పేర్కొంది.

Read More పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

ఇదిలా ఉంటే ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన కంగన.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోంది. చివరి దశలో భాగంగా ఈ స్థానానికి జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 14వ తేదీన ఆమె నామినేషన్ వేసింది. అనంతరం మాట్లాడుతూ... “మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. రాజకీయ రంగంలోనూ రాణిస్తానని విశ్వాసంగా ఉన్నా’’ అని కంగనా చెప్పుకొచ్చింది.

Related Posts