CBN at Shiridi: షిర్డీలో వృద్ద ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు

CBN at Shiridi: షిర్డీలో వృద్ద  ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు

విశ్వంభర అమరావతి :- షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ  ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన బండ్లమూడి రామ్మోహన్ ఛైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకూ వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్, శ్రీనివాస్ సేవాగుణాన్ని చంద్రబాబు అభినందించారు. సాయిబాబా దేవాలయానికి 3 కి.మీ దూరాన ఈ ఆశ్రమం 1998లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Image 2024-05-17 at 4.06.55 PM

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

WhatsApp Image 2024-05-17 at 4.06.54 PM

Tags:

Related Posts